కోవిడ్ బాధితుడు మహేంద్రహిల్స్ వాసి కావడం వల్ల అక్కడి ప్రజలతో మాట్లాడడానికి, కలవడానికి చుట్టుపక్కల ప్రజలు జంకుతున్నారు. అక్కడి విద్యార్థులు మూడు రోజులు పాఠశాలలకు రావద్దని తిప్పి పంపించారు. మహేంద్రహిల్స్‌లోని సెయింట్ ఆక్జీలియం పాఠశాల, దిల్లీ పబ్లిక్ స్కూల్, సెయింట్ ఫ్రాన్సిస్ కాన్వెంట్ స్కూల్, బచ్పన్ స్కూల్ విద్యార్థులకు సెలవు ప్రకటించి ఉపాధ్యాయులు, సిబ్బంది ఇళ్లకే పరిమితమయ్యారు. సాధారణ సమయంలోనే మహేంద్రహిల్స్ నిర్మానుష్యంగా ఉంటుంది. అలాంటిది కరోనా భయంతో కర్ఫ్యూ వాతవరణాన్నే తలదన్నేలా తయారయ్యింది.
ఇళ్లకు పరిమితమవ్వడమే కాకుండా, విధులు నిర్వర్తించడానికి మాస్కులు ధరించి వెళ్తున్నారు. బయటికి వెళ్లిన వారితో మాట్లాడటానికి ఇతర సిబ్బంది భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మహేంద్రహిల్స్‌లో బీసీ బాలుర వసతి గృహం ఉంది. అక్కడే ఉంటూ సికింద్రాబాద్, అడ్డగుట్ట, మారేడ్ పల్లి ప్రభుత్వ పాఠశాలల్లో వారు చదవుకుంటారు. అక్కడి పాఠశాలలకు కూడా మూడు రోజులపాటు రావద్దని పంపించారు. వీలైనంత తొందరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టి కరోనా భయం నుంచి బయట పడేయాలని స్థానికులు కోరుతున్నారు. నిన్న మహేంద్రహిల్స్‌లో కంటోన్మెంట్ శానిటేషన్ విభాగం పరిశుభ్రత, అవగాహన చర్యలు చేపట్టింది. ఈరోజు మహేంద్రహిల్స్‌లో జీహెచ్ఎంసీ సిబ్బంది పరిశుభ్రత చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి : నాపై దాడి చేశారు... చర్యలు తీసుకోండి : రాహుల్ సిప్లిగంజ్