మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగివున్న లారీని.. మరో లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ఓఆర్ఆర్పై లారీ (టీఎన్24ఏడీ 0698) కొల్లూరు నుంచి వరంగల్ వెళ్తుండగా మార్గమధ్యంలో దుండిగల్ వద్ద లారీ జాయింట్ బోల్ట్ ఉండిపోయింది. లారీని పక్కకు ఆపి క్లీనర్ యాకుబ్ సరిచేస్తుండగా.. పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసులు క్లీనర్‌తో మాట్లాడుతుండగా గుర్తుతెలియని మరో లారీ వెనక నుంచి పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టింది.
పోలీస్ వాహనం రిపేర్ చేస్తున్న లారీ క్లీనర్‌ను బలంగా తాకగా.. పోలీసు వాహనానికి లారీకి మధ్యలో ఇరుక్కుపోయి క్లీనర్ యాకుబ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో హోంగార్డు హరికిషన్, హెడ్ కానిస్టేబుల్ నవీన్‌కు స్వల్ప గాయలవగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'తనిఖీ నివేదికలు సమర్పించకుంటే నుమాయిష్ నిర్వహించొద్దు'