ప్రతి నియోజకవర్గంలోని పురపాలికలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మేడ్చల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని పురపాలికలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామన్నారు. పురపాలికలో పారిశుద్ధ్యం, పార్కుల అభివృద్ధి, మొక్కల పెంపకం, తాగునీటి సరఫరా వంటి కనీస సేవలను మరింత మెరుగ్గా అందించేందకు కమిషనర్లు ప్రయత్నించాలని సూచించారు.
బోడుప్పల్ మున్సిపాలిటీని చూసి నేర్చుకోండి..
ప్రతి పురపాలికలో పౌరసేవా కేంద్రం ఏర్పాటు, శ్మశాన వాటికల అభివృద్ధి, లేఅవుట్లలో ఖాళీ స్థలాల రక్షణ, సీసీ కెమెరాలు, వ్యర్థాల నిర్వహణ తదితర కార్యక్రమాలను చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మేడ్చల్ అసెంబ్లీ పరిధిలోని బోడుప్పల్ ఆదర్శ మున్సిపాలిటీగా వివిధ కార్యక్రమాలు చేపడుతోందని... మిగిలిన పురపాలికలు అక్కడి కార్యక్రమాలు అధ్యయనం చేయాలని సూచించారు. తన పురపాలికను ఆదర్శంగా తీర్చిదిద్దే సవాలును ప్రతి కమిషనర్ తీసుకోవాలని కేటీఆర్ కోరారు.
ఈ- ఆఫీస్ వినియోగం తప్పనిసరి
కొత్త చట్టంపై ప్రతి పురపాలికలోని అధికారులు, సిబ్బంది కోసం ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని కమిషనర్లను అదేశించారు. ఈ - ఆఫీస్ వినియోగాన్ని తప్పనిసరి చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: నిధులు దుర్వినియోగం చేసిన ఉద్యోగి సస్పెండ్