హైదరాబాద్ శివారులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని ఎదులాబాద్‌లో గాలులకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకులాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచింది.
ఆరుగాలం కష్టం పడి పండించిన వరి ధాన్యం అకాల వర్షంతో నీటిపాలయింది. వర్షానికి పలుచోట్ల ధాన్యం కొట్టుకుపోయింది. మరికొన్ని చోట్ల మామిడికాయలు రాలిపోయాయి. చేతికొచ్చిన ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇటు ఉప్పల్, రామంతపూర్, హబ్సీగూడలో ఈదురుగాలులకు గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇదీ చదవండి: ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి పట్టింపు లేదు: ఉత్తమ్