కరోనా కట్టడికి లాక్‌డౌన్ మంచి ఫలితాలు ఇస్తోందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ అన్నారు. కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ను పటిష్ఠంగా అమలు చేస్తున్నందున కొవిడ్ కేసులు, మరణాలు తగ్గాయని తెలిపారు. ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలోని రామంతాపూర్, ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో సీపీ తనిఖీలు చేశారు. లాక్‌డౌన్ అమలు విధానాన్ని అక్కడి పోలీసులను అడిగి తెలుసుకున్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని... వాహనాలను సీజ్ చేస్తున్నామని సీపీ తెలిపారు. కొందరు అనవసరంగా బయటకు వస్తున్నారని పేర్కొన్నారు. పౌరులు, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం పరస్పర సహకారంతోనే లాక్‌డౌన్ సత్ఫలితాలు ఇస్తోందని అన్నారు.
ఇదీ చదవండి: పల్లెల్లో కరోనా కల్లోలం.. వైరస్ ఉద్ధృతికి కారణాలివే..!