స్వామి వివేకానంద 158వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నివాళులర్పించారు. మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్ సఖీకేంద్రంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని స్త్రీలను, పిల్లలను ఆదుకోవడంలో సానుకూల దృక్పథంతో పని చేయాలని సూచించారు.
గృహ హింస చట్టంలో వివిధ నిబంధనలపై సఖీ సిబ్బందితో మాట్లాడారు. అవసరమైనప్పుడు తమ మద్దతును అందిస్తామని మహేష్ భగవత్ హామీ ఇచ్చారు. సఖీ సెంటర్లలో నివసిస్తున్న మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించామని ఆయన చెప్పారు. కట్నం తీసుకోవడం నేరమని దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరమని ప్రతి ఒక్కరూ దీనిపై దృష్టి సారించాలని సీపీ కోరారు.