భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ... మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట బస్‌స్టాండ్ వద్ద దళితులు ఆందోళనకు దిగారు. దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. దళితులకు రాజాసింగ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తమకు క్షమాపణ చెప్పకపోతే పార్టీ నుంచి రాజాసింగ్‌ను సస్పెండ్ చేయాలని పార్టీ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేపట్టడానికైనా వెనుకాడబోమని వారు హెచ్చరించారు.
ఇటీవల ఓ సందర్భంలో రాజాసింగ్ గోమాంసం తినేవారిని దూషించడమే కాకుండా.. వీరి నుంచి రామమందిర నిర్మాణానికి చందాలు తీసుకోవద్దన్నారు. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహించిన దళిత సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి.
ఇదీ చూడండి: ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ సరికాదు: వీహెచ్