Telangana Crime News : నలుగురు స్నేహితులు. వారంతా శ్మశానవాటికలో శవాలు కాల్చిన తర్వాత బూడిదలో బంగారం, వెండి కోసం వెతుకుతుంటారు. అయితే వీరిలో ఇద్దరు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ కేసులను ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు రెండు హత్యల మిస్టరీని ఛేదించి, హత్య చేసింది మిగిలిన ఇద్దరు స్నేహితులని తేల్చారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఈ హత్యలకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ నగరంలోని ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏసీపీ రాజావెంకట్ రెడ్డి వెల్లడించారు.
నిజామాబాద్ నగరంలోని మహమ్మదీయ కాలనీకి చెందిన అమర్‌ఖాన్, రియాజ్‌ఖాన్, అలాగే ఆటోనగర్‌కు చెందిన మహమ్మద్ బహదూర్, బాబన్‌సాహబ్ పహాడ్‌కు చెందిన దివ్యాంగుడు సయ్యద్ యూసుఫ్ నలుగురు స్నేహితులు. వీరి వృత్తి శ్మశానవాటికలో శవాలు కాల్చిన తర్వాత బూడిదలో బంగారం, వెండి కోసం వెతకడం. ఈ నెల 18న వీటి కోసం అమర్‌ఖాన్, రియాజ్‌ఖాన్, మహమ్మద్ బహదూర్ ముగ్గురు కలిసి ద్విచక్ర వాహనంపై ఆర్మూర్ రోడ్డులోని నిజాం సాగర్ కెనాల్‌కు ఆనుకొని ఉన్న శ్మశానవాటికకు వెళ్లారు.
అక్కడి శ్మశానవాటికలో బూడిదను సేకరించి నీటిలో కడగగా వారికి ఏమీ దొరకలేదు. ఈ క్రమంలో మద్యం తాగి అక్కడి నుంచి గూపన్‌పల్లి శ్మశానవాటికకు వెళ్లారు. అక్కడ వెళ్లి వెతికినా ఏమీ లభించలేదు. దీంతో రూ.1000 ఖర్చు చేసినా ఏమీ దొరకలేదని వారి మధ్య గొడవ జరిగింది. దీంతో అమర్‌ఖాన్, రియాజ్‌ఖాన్ కలిసి పక్కనే ఉన్న కర్ర తీసుకున్నారు. గొడవలో బహదూర్ తలపై కొట్టారు. ఇలా కొట్టడంతో అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని పులాంగ్ వాగులో తోసేశారు.
బహదూర్ ఎక్కడని ప్రశ్నించిన యూసుఫ్ : అనంతరం ఏమీ తెలియనట్లు అమర్‌ఖాన్, రియాజ్‌ఖాన్ వెనుకకు వచ్చేశారు. ఈ క్రమంలో సయ్యద్ యూసుఫ్ వారిని ప్రశ్నించారు. ముగ్గురూ కలిసి వెళ్లారుగా, బహదూర్ ఎక్కడ అని అడిగాడు. దీంతో వారిద్దరూ భయపడి హత్య విషయం యూసుఫ్ కారణంగా బయటకు వస్తుందని భావించారు. దీంతో ఈ నెల 19న స్నానానికి వెళ్దామని చెప్పి యూసుఫ్‌ను బాబన్‌సాహబ్ పహాడ్‌లోని జాలి చెరువు వద్దకు తీసుకెళ్లారు. స్నానం చేస్తున్నట్లు నటించి యూసుఫ్‌ను నీట ముంచి చంపి అక్కడి నుంచి పరారయ్యారు.
సాంకేతికత సాయంతో దొరికిన నిందితులు : నీటిలో మృతదేహం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆరో పోలీస్ స్టేషన్‌లో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు కేసును నమోదు చేశారు. ఈ క్రమంలో సౌట్ రూరల్ సీఐ సురేశ్ దర్యాప్తును ప్రారంభించి, నలుగురు స్నేహితుల్లో ఇద్దరు మృతి చెందడంతో అనుమానం వచ్చి విచారణ చేశారు. సాంకేతికను ఆధారంగా చేసుకొని అమర్‌ఖాన్, రియాజ్‌ఖాన్‌లే బహదూర్, యూసుఫ్‌లను హత్య చేశారని తేల్చారు. నిందితులను పట్టుకుని రిమాండ్‌కు పోలీసులు తరలించారు.
ప్రేమ కోసం దారుణం - నడిరోడ్డుపై ఆటో డ్రైవర్‌ను హత్య చేసిన మరో డ్రైవర్
'ఆమెకు ఉరే సరి'- జ్యోతిషుడు చెప్పాడని బాయ్‌ఫ్రెండ్‌ను చంపిన యువతికి మరణ శిక్ష