ETV Bharat / state

ప్రైవేట్​ ఆస్పత్రుల్లో పడకలు.. కరోనా రోగులకు కొత్త ఇబ్బందులు - ప్రైవేటు ఆస్పత్రుల ఆగడాలు

హైదరాబాద్​లో ప్రైవేట్ ఆస్పత్రులు అందినకాడికి దోచుకుంటున్నాయి. రోగిని చేర్చుకునేముందు ఒకమాట.. చేరాక మరోమాట చెప్పి ప్రజలను ముంచుతున్నాయి. ముందుగానే అడ్వాన్సులు కట్టించుకుని అన్నీ మీరే తెచ్చుకోవాలంటూ మెలిక పెడుతున్నాయి. ఆక్సిజన్‌, ఇంజక్షన్లు లేవంటూ ప్రైవేటు ఆస్పత్రుల్లో సాకులు చెబుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో బాధితుల బంధువులే బయటి నుంచి ఆక్సిజన్​ సిలిండర్లు కొని తెచ్చి తమ వారి ప్రాణాలు కాపాడుకుంటున్నారు.

private hospitals collecting huge amount
హైదరాబాద్​లో ప్రైవేట్ ఆస్పత్రుల దందా
author img

By

Published : May 24, 2021, 9:35 AM IST

తరుముకొచ్చిన కొవిడ్‌ గండం. పడకలు దొరుకుతాయో లేదనే గుబులు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆసుపత్రులకు చేరుతున్న కరోనా రోగులకు కొత్తసవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. పలు ఆసుపత్రులు వైద్యం అందిస్తాం! కానీ షరతులు వర్తిస్తాయంటూ ముఖానే చెబుతున్నాయి. కొవిడ్‌ రోగి ఆరోగ్య పరిస్థితిని సాకుగా చూపుతూ రూ.లక్షలు వసూళ్లు చేస్తున్న ‘కాసు’పత్రులపై నిత్యం ఏదోమూల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్‌ పరిధిలోని వందలాది ఆసుపత్రులకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు ప్రాంతాల నుంచి రోగులు చికిత్స కోసం వస్తున్నారు. కొవిడ్‌కు అదనంగా బ్లాక్‌ఫంగస్‌ కూడా జతకట్టడంతో ప్రైవేటు వైద్యానికి విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. దీన్ని అవకాశంగా మలచుకున్న పలు ప్రైవేటు ఆసుపత్రులు వివిధ మార్గాల్లో రోగులకు షరతులు విధిస్తున్నాయి.

నగరంలోని నాగోలు సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి కాకినాడ నుంచి కరోనా రోగిని వైద్యం కోసం తీసుకొచ్చారు. ముందుగా రూ.లక్ష చెల్లించమన్నారు. ఆ తరువాత అసలు విషయం బయటపెట్టారు. అత్యవసర సమయంలో ఉపయోగించే ఖరీదైన ఇంజక్షన్లు మీరే తెచ్చుకోవాలి. ఆరోగ్య బీమా సొమ్ములకు మీరే దరఖాస్తు చేసుకోవాలంటూ మరో నిబంధన. నాలుగురోజుల తరువాత మా వద్ద ఆక్సిజన్‌ లేదు.. మీరే తెచ్చుకోవాలంటూ మెలిక పెట్టి చేతులెత్తేశారు.’ దీంతో బాధితులు తమకు పరిచయం ఉన్న వారి ద్వారా రూ.40,000కు ఆక్సిజన్‌ సిలిండర్‌ తీసుకుని రోగి ప్రాణాలు కాపాడుకోవాల్సి వచ్చిందంటూ బంధువులు వాపోయారు.

ఒప్పుకొంటేనే చేరండి..

కొవిడ్‌ రోగులకు వైద్యం అందించేందుకు పలు ప్రైవేటు ఆసుపత్రులు కొత్త నిబంధనలు విధిస్తున్నాయి. వాటికి అంగీకరించిన వారికి మాత్రమే వైద్యమంటూ ముఖానే చెప్పేస్తున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకొర్చి వచ్చిన రోగులు వాటికి తలొగ్గుతున్నారు. ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధికి తీవ్రజ్వరం రావటంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత కరోనా అని నిర్ధారణ కావడంతో వైద్యం ప్రారంభించారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు తమ వద్ద లేవంటూ చివర్లో ఆస్పత్రి యాజమాన్యం చేతులెత్తేసింది. అక్కడ పనిచేసే నర్సు సహాయంతో రూ. 2లక్షలు వెచ్చించి నల్లబజారులో ఇంజక్షన్‌ తెప్పించి ఇప్పించాల్సి వచ్చిందని రోగి స్నేహితుడొకరు తమ అనుభవాన్ని వివరించారు. పడక కేటాయించిన తరువాత వైద్యపరీక్షలు, ఇంజక్షన్లు, ఆక్సిజన్‌ సిలిండర్ల తెచ్చుకోవాల్సిన బాధ్యత రోగుల బంధువులపై వేస్తున్నారు. నగరంలో పరిచయస్తులు, బంధువులున్న వారు ఏదో మార్గంలో వాటిని సేకరించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన రోగుల సహాయకులకు ఇవన్నీ ప్రతిబంధకాలుగా మారుతున్నాయి.

ఆసుపత్రుల వద్ద దళారుల దందా

టువంటి క్లిష్టపరిస్థితుల్లో రోగికి అవసరమైన ఇంజక్షన్లు, ఆక్సిజన్‌ కోసం ఆసుపత్రుల బయట ఉండే ఏజెంట్లు/దళారులపై ఆధారపడుతున్నారు. తమ వారి ప్రాణాలు కాపాడుకునేందుకు అడిగినంత ఇచ్చి భారీఎత్తున కమీషన్‌ కూడా ముట్టజెబుతున్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు/సిబ్బందే మధ్యవర్తుల పాత్ర పోషించటం గమనార్హం. గుంటూరు జిల్లాకు చెందిన ఓ మధ్యవయస్కునికి కరోనా సోకింది. మధుమేహ సమస్య కూడా ఉందనే కారణంతో 14 రోజుల పాటు గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. 4 రోజులు ఆక్సిజన్‌ ఇచ్చినందుకు రూ.1.50లక్షల బిల్లు చేతికిచ్చారు. అదే ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయిన మరొకరికి రూ.350 విలువైన ఇంజక్షన్‌ ఇచ్చేందుకు రూ.1500 చొప్పున వసూలు చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఇలాంటి చీకటి వ్యవహారాలు బయటకు రాకుండా ఉండేందుకు రోగులు/సహాయకుల సెల్‌ఫోన్లను రిసెప్షన్‌లో ఇవ్వాలంటూ కొన్ని ఆసుపత్రులు షరతులు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.

ఇదీ చూడండి: ప్రాజెక్ట్‌ మదద్‌.. కరోనా పల్లెలకు అండగా ప్రవాసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.