ఐదు నెలల గర్భిణీ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా ఆర్ఎల్ నగర్లో చోటుచేసుకుంది. తమ కూతురిని వేధింపులకు గురిచేసి అత్తమామలు చంపారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. భర్త ఫోన్ చేసి మీ కూతురు కళ్లు తిరిగి పడిపోయిందని ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారని మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురి మెడ, చేతిపై గాయాలు ఉన్నాయని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: నలుగురు చిన్నారులపై కుక్కల మూకుమ్మడి దాడి