ETV Bharat / state

సీపీ స్పందన.. మహిళ బర్త్​డే నిర్వహించిన పోలీసులు

తన తల్లి పుట్టినరోజు వేడుకలను జరిపించాలని అమెరికాలో ఇంజినీర్​గా పనిచేస్తున్న ఓ వ్యక్తి రాచకొండ పోలీస్​ కమిషనర్​ మహేశ్ ​భగవత్​ను కోరాడు. స్పందించిన సీపీ.. ఆమె జన్మదిన వేడుకలను జరిపించాడు.

author img

By

Published : May 8, 2020, 12:36 PM IST

police celebrated a women birth day at neredmet
సీపీ స్పందన.. మహిళ బర్త్​డే నిర్వహించిన పోలీసులు

మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా నేరేడ్​మెట్ పోలీస్​స్టేషన్ పరిధిలో నివాసం ఉండే మంజులత కుమారుడు రాజ్​లలిత్ అమెరికాలో ఇంజినీర్​గా పనిచేస్తున్నాడు. లాక్​డౌన్​తో దుకాణాలన్నీ మూసి ఉండటం వల్ల తన తల్లి పుట్టిన రోజు వేడుకలు జరిపించాలని మెయిల్​ ద్వారా రాచకొండ సీపీ మహేశ్ భగవత్​ను కోరాడు. స్పందించిన సీపీ... వెంటనే నేరేడ్​మెట్ పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్సై రాఘవేంద్రరెడ్డి, మహిళా కానిస్టేబుల్ ఈశ్వరమ్మ.. ఓ కేక్​ను మంజులత ఇంటికి తీసుకెళ్లారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు.. దగ్గరుండి కేక్ కట్ చేయించారు. మెయిల్​కు స్పందించిన రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్, నేరేడ్​మెట్ పోలీసులకు రాజ్​లలిత్ కృతజ్ఞతలు తెలిపాడు.

ఇదీ చూడండి:రోడ్లపైకి భారీగా వలస కూలీలు.. పోలీసుల లాఠీఛార్జ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.