ETV Bharat / sports

IPL మెగా వేలం: సర్ఫరాజ్​పై ఆ రెండు ఫ్రాంచైజీల కన్ను- భారీ ధర ఖాయం!

కివీస్​తో టెస్టులో సెంచరీ- దేశవాళీ క్రికెట్​లో అదరగొడుతున్న సర్ఫరాజ్- ఐపీఎల్ వేలంలో దక్కించుకునేందుకు ఆ రెండు ఫ్రాంచైజీల ప్లాన్!

author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

Sarfaraz Khan IPL 2025
Sarfaraz Khan IPL 2025 (Source: Associated Press (Left), ETV Bharat (Right))

Sarfaraz Khan IPL 2025 : బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్​తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ భారీ సెంచరీతో ఆకట్టుకున్నాడు. నాలుగో రోజు ఆటలో చెలరేగి ఆడిన సర్ఫరాజ్ తన కెరీర్​లో తొలి అంతర్జాతీయ సెంచరీ చేశాడు. రెండో ఇన్నింగ్స్​లో టీమ్ఇండియాకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.

2025 ఐపీఎల్ మెగా వేలం మరో నాలుగు లేదా ఆరు వారాల్లో జరగనుంది. ఈ క్రమంలో ఫ్రాంచైజీలు యంగ్ ప్లేయర్లపై దృష్టి సారించాయి. వీరిలో సర్ఫరాజ్ ఖాన్ ఒకడు. ఇటీవల కాలంలో సర్ఫరాజ్ దేశవాళీ క్రికెట్​లో అదరగొడుతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు. ఇటు అంతర్జాతీయ టెస్టుల్లోనూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్​పై ఐపీఎల్ ఫ్రాంచైజీలు రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ కన్నేశాయట. మెగా వేలంలో సర్ఫరాజ్​ను దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్ల తెలుస్తోంది.

ముంబయి ఇండియన్స్
ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ సర్ఫరాజ్ ఖాన్‌ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. సర్ఫరాజ్ స్వస్థలం ముంబయినే. కొంతకాలంగా హోమ్ గ్రౌండ్​లో జరుగుతున్న లీగ్​ల్లో సర్ఫరాజ్ స్థిరంగా రాణిస్తున్నాడు. అలాగే మంచి టాలెంట్ కూడా ఉంది. లోకల్ ప్లేయర్లను ప్రోత్సహించడంలో ముంబయి జట్టు ముందుంటుంది. ఈ క్రమంలో సర్ఫరాజ్​ను మెగా వేలంలో దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే బలమైన మిడిలార్డర్ కోసం ప్రయత్నిస్తున్న ఆ జట్టుకు సర్ఫరాజ్ మంచి ఆప్షన్ అవుతాడు. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుని, భారీ స్కోరు చేయడంలో సర్ఫరాజ్ దిట్ట.

రాజస్థాన్ రాయల్స్
టాలెంట్ ఉన్న యంగ్ ప్లేయర్లను దక్కించుకునే ఫ్రాంచైజీలో రాజస్థాన్ ముందు వరుసలో ఉంటుంది. తమ జట్టుకు కూడా సర్ఫరాజ్ మిడిలార్డర్ బ్యాటర్​గా పనికొస్తాడని ఆ జట్టు భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్​లో స్పిన్ అనుకూలంగా ఉన్న పిచ్​లోనూ సర్ఫరాజ్ ఇరగదీస్తాడని రాజస్థాన్ నమ్మకం.

జాస్ బట్లర్, సంజూ శాంసన్ వంటి హిట్లర్లు రాజస్థాన్ రాయల్స్​కు ఉన్నారు. అయితే మిడిలార్డర్​లో సర్ఫరాజ్ లాంటి దూకుడైన బ్యాటర్లు ఉంటే వారిపై ఒత్తిడి తగ్గుతుందని ఫ్రాంచైజీ భావన. అలాగే జట్టు కూడా బలపడుతుందని నమ్మకం. అందుకే రాజస్థాన్ రాయల్స్ జట్టు త్వరలో జరిగే ఐపీఎల్ మెగా వేలంలో సర్ఫరాజ్ ను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇరు ఫ్రాంచైజీలు మొగ్గు!
అయితే సర్ఫరాజ్ వంటి యంగ్ ప్లేయర్​పై ఎంత పెట్టుబడి పెట్టాలనే విషయంపై రాజస్థాన్, ముంబయి జట్లు ఒకసారి అంచనా వేసుకోవాలి. అయితే వేలానికి ముందే సర్ఫరాజ్​తో ముంబయి జట్టు సంప్రదింపులు జరిపి, అతడిని దక్కించుకోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రాజస్థాన్ జట్టు కూడా సర్ఫరాజ్​ను కొనుగోలు చేసేందుకు వెనుకాడకపోవచ్చు. అయితే సర్ఫరాజ్ టాలెంట్, మెగా వేలంలో ప్రపంచస్థాయి క్రికెటర్లు లేకపోవడం వల్ల అధిక ధర పలికే అవకాశం ఉంది.

Sarfaraj Khan IPL Career: 2015 ఐపీఎల్​లో ఆర్సీబీ తరఫున సర్ఫరాజ్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ తరఫు ఆడాడు. ఇప్పటివరకు పలు సీజన్లలో సర్ఫరాజ్ ఆడినప్పటికీ తనదైన ముద్ర వేయలేకపోయాడు. ఐపీఎల్​లో మొత్తం 37 ఇన్నింగ్స్​ల్లో 130.58 స్ట్రైక్​ రేట్​తో 585 పరుగులు నమోదు చేశాడు. కాగా, చివరిసారిగా 2023లో ఆడాడు.

సింపుల్ లైఫ్, కానీ ఖరీదైన లగ్జరీ కార్లు - సర్ఫరాజ్ నెట్ వర్త్ ఎన్ని కోట్లంటే?

తొలి సెంచరీతోనే అరుదైన క్లబ్​లో సర్ఫరాజ్- దిగ్గజాల సరసన చోటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.