ETV Bharat / entertainment

'అన్​స్టాపబుల్' సీజన్ 4 -​ ఫస్ట్ ఎపిసోడ్​లోనే పవర్​ఫుల్ గెస్ట్-ఎవరంటే? - UNSTOPPABLE WITH NBK S4

నందమూరి బాలకృష్ణ హోస్ట్​గా 'అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే సీజన్ 4' అక్టోబర్ 24న ప్రారంభం కానుంది. మరి ఈ సీజన్​లో తొలి ఎపిసోడ్ గెస్ట్​లు ఎవరో తెలిసిపోయింది.

Unstoppable with NBK S4
Unstoppable with NBK S4 (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2024, 9:44 PM IST

Unstoppable With NBK S4 : నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్​గా 'అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే సీజన్ 4' మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. గత సీజన్లలో ఇప్పటివరకు పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు షోకు గెస్ట్​లుగా విచ్చేసి సందడి చేశారు. ఈ నేపథ్యంలో నాలుగో సీజన్​లో తొలి ఎపిసోడ్​కు ఎవరు గెస్ట్​గా రానున్నారని ఆడియెన్స్​లో ఆసక్తి నెలకొంది. ఈ ఎపిసోడ్​కు సంబంధించి గెస్ట్​ గురించి సోషల్ మీడియాలో ఓ ప్రచారం సాగుతోంది.

అయితే గత మూడు సీజన్ల కంటే ఈసారి ప్రేక్షకులకు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే తొలి ఎపిసోడ్​ను గ్రాండ్​గా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగో సీజన్​కు తొలి గెస్ట్​గా రానున్నారని తెలుస్తోంది. ​ప్రోగ్రామ్​లో ఆయనకు సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ అయ్యిందని సమాచారం. అయితే ఏపీ డిప్యూటీ సీఎం, స్టార్ హీరో పవన్ కల్యాణ్​ కూడా తొలి ఎపిసోడ్​లో కనిపించనున్నారని తెలిసింది. ఆయన ఆదివారం ఈ పోగ్రామ్​ షూట్​లో పాల్గొనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్​మెంట్ రావాల్సి ఉంది.

ఇక తొలి ఎపిసోడ్ తర్వాత పాన్ఇండియా ఫిల్మ్ 'పుష్ప ది రూల్' మూవీ టీమ్ షోకు రానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మంధన్నా సెకండ్ ఎపిసోడ్​లో గెస్ట్​లుగా రానున్నట్లు తెలిసింది. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా 'కంగువ' టీమ్​తో సందడి చేయనున్నారట. ఈ ఫన్ ఎంటర్టైన్మెంట్ టాక్ షో ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్​కు అందుబాటులో ఉండనుంది. అక్టోబర్ 24న తొలి ఎపిసోడ్ వచ్చే ఛాన్స్ ఉంది.

Balayya NBK 109 : ఇక బాలకృష్ణ ప్రస్తుతం ఎన్​బీకే 109 షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ స్టార్ బాబీ దేఓల్ విలన్​గా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైనర్‌మెంట్‌ బ్యానర్​పై సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య దీన్ని నిర్మిస్తున్నారు. తమన్నాతో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, ఈ వార్తలపై టీమ్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణం విజయ్‌ కార్తీక్‌ చూసుకుంటున్నారు.

'హోస్ట్​గా నాకు చాలా ఆఫర్లు వచ్చాయి- ఆయన కోసమే ఈ షో చేస్తున్నాను'

బాలయ్య 'అన్​స్టాపబుల్' సీజన్ 4 -​ ఈ సారి ఎంటర్​టైన్మెంట్​ మామూలుగా ఉండదు! - Unstoppable Season 4

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.