మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలో మే 17న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్సార్నాయక్నగర్కు చెందిన రాజేశ్సింగ్.. మే 10న తన అన్న చనిపోయాడని చేవెళ్లకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన దుండగుడు... ఇద్దరు మైనర్లతో కలిసి దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న రూ.ఐదు లక్షల నగదు, నాలుగు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దొంగతనం జరిగిందని గుర్తించిన స్థానికులు... పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. క్లూస్ టీం సహకారంతో వేలిముద్రల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు.
పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరు ఈ దొంగతనమే కాక జీడిమెట్లలో ఓ బైకును, సురారంలోని ఓ ఇంట్లో బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు విచారణలో తెలిపారు. నిందితుల నుంచి రూ. 4.62లక్షలు విలువైన నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మేజర్ అయిన రవిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని.. మరో ఇద్దరు మైనర్లను జువైనల్ కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి: మనుషులపై అమెరికా సంస్థ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్