అల్పపీడన ద్రోణి ప్రభావంతో సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీవర్షం కురుస్తోంది. బోయిన్పల్లి, అల్వాల్, తిరుమలగిరి బొల్లారం, మారేడ్పల్లి, చిలకలగూడ, ప్యారడైస్, బేగంపేట్ ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. ఫలితంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది.
మరోవైపు నగరంలోని ఏంజే మార్కెట్, బేగంబజార్, సిద్దింబర్బజార్, గోషామహల్ తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు దుకాణాల్లోకి నీరు చేరడంతో వ్యాపారులు అవస్థలు పడుతున్నారు.
ఇదీచూడండి: కొత్తగూడెంలో భారీ వర్షం... బొగ్గు ఉత్పత్తికి ఆటంకం