మేడ్చల్ జిల్లా ఉప్పల్-రామంతపూర్ ప్రభుత్వ హోమియోపతి ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ నిలిపివేశారని ప్రజలు ఆందోళనకు దిగారు. ఉదయం 5 గంటల నుంచి గేటు ముందు ఎదురుచూస్తున్న ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులో లేదని సమాధానం ఇవ్వడం వల్ల ఆస్పత్రి సిబ్బందితో ప్రజలు గొడవకు దిగారు.
కనీసం ఆస్పత్రిలో గేటు బయట ఒక బోర్డు కూడా పెట్టలేదని.. సమాచారం ఇవ్వకుండా.. ఇష్టం ఉన్న చోటచెప్పుకోండి అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని ఆందోళనకు దిగారు. ఓవైపు కరోనా నిర్ధరణ పరీక్ష కోసం వెళ్లిన వారు.. మరోవైపు వ్యాక్సినేషన్ కోసం వెళ్లిన వారంతా ఒకే చోట చేరడం వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.