ETV Bharat / state

వరదసాయానికి పోటెత్తిన బాధితులు.. 'మీ సేవ'ల వద్ద ఆందోళనలు

గ్రేటర్​ ఎన్నికలు ముగియడంతో వరదసాయం కోసం దరఖాస్తు చేసేందుకు మీసేవల వద్ద రద్దీ పెరిగింది. ఎన్నికల ముందు ప్రభుత్వం ఏడో తేదీ నుంచి పంపిణీ కార్యక్రమం చేపడుతామని హామీ ఇవ్వడంతో ఉదయం నుంచే బాధితులు పెద్దఎత్తున తరలివచ్చారు. జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేశ్​కుమార్ నేరుగా అకౌంట్లలో జమ చేస్తామని స్పష్టం చేసినా రద్దీ మాత్రం తగ్గలేదు.

People lined up in front of meeseva centres at khuthbullapur constituency
కుత్బుల్లాపూర్​లో మీసేవల ముందు బారులు తీరిన ప్రజలు
author img

By

Published : Dec 7, 2020, 12:40 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికలు ముగిశాక ఏడో తేదీ నుంచి వరదసాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో బాధితులు మీసేవల వద్దకు చేరుకుంటున్నారు. కుత్బుల్లాపూర్​ పరిధిలోని మీసేవ కేంద్రాల వద్ద ఉదయం నుంచే జనాలు బారులు తీరారు.

ఒకవైపు జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేశ్​కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు నేరుగా అకౌంట్లలో వేస్తామని ప్రకటించినా రద్దీ ఏమాత్రం తగ్గలేదు. సమయం 11 గంటలు దాటినా మీసేవ కేంద్రాలు తెరవకపోవడంతో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:వరదసాయం కోసం మీ-సేవ కేంద్రాలకు రావొద్దు: జీహెచ్ఎంసీ కమిషనర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.