మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. మంగళవారం నోటిఫికేషన్ విడుదల కావడం వల్ల నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు వరుస కట్టారు. నిజాంపేట నగరపాలక సంస్థ పరిధిలో 30 వార్డుల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని గుండ్ల పోచంపల్లి, తూముకుంట మున్సిపాలిటీల పరిధిలో నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
సికింద్రాబాద్ జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డ్వాక్రా సంఘం కార్యాలయంలో అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. ఈ ప్రక్రియ మొదలుకావడం వల్ల పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి అభ్యర్థులను మాత్రమే నామినేషన్ కేంద్రాల్లోకి అనుమతించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో ర్యాలీలకు అనుమతి తప్పనిసరి పోలీసులు చెబుతున్నారు.
నాగారం, దమ్మాయిగూడలో పురపోరుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, నామినేషన్ కార్యాలయాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: నామినేషన్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం