ETV Bharat / state

కూకట్​పల్లిలో నూతన పోలీస్​స్టేషన్​ ప్రారంభం - new kukatpally police station opened

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా కూకట్​పల్లిలోని నూతన పోలీస్​స్టేషన్​ను సైబరాబాద్​ పోలీస్​ కమిషనర్​ వీసీ సజ్జనార్, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు, ఎమ్మెల్సీ నవీన్​రావులు ప్రారంభించారు. ఎమ్మెల్యేకు కేటాయించిన క్వార్టర్స్​ను పోలీస్​స్టేషన్​ నిర్మాణానికి ఇచ్చినందుకు ఎమ్మెల్యేకు సజ్జనార్​ కృతజ్ఞతలు తెలిపారు.

new kukatpally police station opened
కూకట్​పల్లిలో నూతన పోలీస్​స్టేషన్​ ప్రారంభం
author img

By

Published : May 29, 2020, 5:44 PM IST

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా కూకట్​పల్లిలో నూతన పోలీస్​స్టేషన్​ను ప్రారంభించారు. దానిని సైబరాబాద్​ సీపీ వీసీ సజ్జనార్​, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్​రావులు ప్రారంభించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎమ్మెల్యే క్వార్టర్స్​ కోసం కేటాయించిన స్థలాన్ని పోలీస్​ స్టేషన్​ కోసం ఇచ్చినందుకు ఎమ్మెల్యేకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యే నిధులతో భవనాన్ని నిర్మించి తమకివ్వడంపై పోలీసులు సంతోషం వ్యక్తం చేశారు. నూతన పోలీస్​స్టేషన్​ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సీపీ సజ్జనార్​ తెలిపారు. ఎవరికి ఎలాంటి ఆపద ఉన్నా.. తాము వెంటనే స్పందిస్తామని సీపీ వెల్లడించారు.

ఇవీ చూడండి : మిడతల రోజూ ప్రయాణం 130 కిలోమీటర్లు.. ఆ జాగ్రత్తలు పాటించాలి!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.