మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నందికంటి శ్రీధర్ నియామకమయ్యారు. ఇటీవల మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ డీసీసీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ వెంటనే దిల్లీ వెళ్లి భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీ తీర్థం తీసుకున్నారు.
దీనితో మేడ్చల్ జిల్లా డీసీసీ నూతన అధ్యక్షుడిగా నందికంటి శ్రీధర్‌ను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియమించారు. తనపై నమ్మకంతో డీసీసీ అధ్యక్షుడిగా నియమించడంపై పార్టీ అధిష్ఠానానికి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నాయకులకి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చదవండి: ఆదివారాల్లో పనిచేయనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు