ఈ నెల 1వ తారీఖున మౌలాలి రైల్వే స్టేషన్‌కి సమీపంలోని చెట్లలో జాషువా శామ్యూల్‌ను దారుణంగా బండరాళ్లతో కొట్టి చంపేశారు. ఎనిమిది నెలల క్రితం మృతుడు శామ్యూల్ ఇంట్లో జరిగిన శుభకార్యంలో చిన్న గొడవ జరిగింది. కాస్పర్ తేజ్ ఇమాండి అనే వ్యక్తిని మృతుడు శామ్యూల్ చెంపపై కొట్టడం వల్ల అతనిపై కక్ష పెంచుకున్నాడు. మనసులోనే పెట్టుకున్న కాస్పర్ తేజ్ అతనితో స్నేహం నటించి అవకాశం కోసం వేచి చూశాడు.
రెండు రోజుల క్రితం రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో మృతుడికి ఫోన్ చేసి పార్టీ చేసుకుందాం రమ్మని పిలిచారు. అతనికి మద్యం తాగించి బండరాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: ఫొని తక్షణ సాయంగా రూ. 1000 కోట్లు: మోదీ