మున్సిపల్ ఎన్నికల నామపత్రాల స్వీకరణకు శుక్రవారంతో గడువు ముగిసింది. ఇవాళ్టి నుంచి నామపత్రాల పరిశీలన చేయనున్నారు. మూడో రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో పలు మున్సిపాలిటీల్లో భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి.
దుండిగల్ మున్సిపాలిటీలో 242 నామినేషన్లు
మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను 242 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. తెరాస-87, భాజపా-44, కాంగ్రెస్-47 సీపీఐ-1, సీపీఎం-2, తెదేపా నుంచి ఒకరు నామినేషన్ వేయగా... వేరే రాష్టంలో గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు-3, స్వతంత్రులు-57 మంది నామినేషన్ వేశారు.
కొంపల్లిలో భారీగా..
కొంపల్లి మున్సిపాలిటీలో 18 వార్డులకు గాను 213 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో తెరాస-79, కాంగ్రెస్-55, భాజపా-38, తెదేపా తరఫున నలుగురు నామినేషన్ వేయగా స్వతంత్రులు-36 వేరే రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీ నుంచి 1 నామినేషన్ వచ్చింది.
శంకర్పల్లిలో 107
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీలో మొత్తం 107 నామపత్రాలు దాఖలయ్యాయి. తెరాస పార్టీ తరఫున 49.. కాంగ్రెస్- 23, భాజపా నుంచి-15, ఎంఐఎం-2, తెదేపా తరఫున 1 నామినేషన్లు దాఖలు కాగా... 17 స్వతంత్రులు నామపత్రాలు దాఖలు చేశారు.
మేడ్చల్ ప్రశాంతంగా
మేడ్చల్ జిల్లాలో పుర, నగరపాలక సంస్థ ఎన్నికలు నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పోచం పురపాలకకు 118 నామపత్రాలు దాఖలవ్వగా... ఘట్కేసర్ పురపాలకకు 151 నామినేషన్లు వచ్చాయి. బోడుప్పల్ నగరపాలక సంస్థలో 185 నామపత్రాలు వేశారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థకు 252 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఇదీ చూడండి: 21 వేల 850 నామినేషన్లు.. నేడు పరిశీలన