మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి పోతరాజు మహేశ్వరి భర్త పోతరాజు రాములు దమ్మాయిగూడ మున్సిపల్ ఆఫీస్ వద్ద వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై మున్సిపల్ కమిషనర్ వచ్చి సమాధానం ఇచ్చేదాకా ట్యాంక్ దిగనని భీష్మించారు. కోఆప్షన్ పోస్ట్‌కు ఆదివారం సకాలంలోనే నామినేషన్ వేశామని... నిర్ణీత గడువు ముగిశాక నామ పత్రాలు దాఖలు చేశారని కమిషనర్ చెప్పడం పట్ల రాములు ఆందోళన వ్యక్తం చేశారు.
మాదే కాదు వారిదీ తిరస్కరించాలి...
తమ తర్వాత వచ్చిన తెరాస వాళ్ల నామినేషన్లు స్వీకరించారని... వాటినీ తిరస్కరించాలని కోరుతూ నిరసనకు దిగారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ వివరణ ఇస్తూ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించామన్నారు. ఇందులో ఎటువంటి అపోహాలకు తావు లేదని కమిషనర్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : ఇలాంటివి చూస్తుంటే నా రక్తం మరిగిపోతోంది: రాహుల్