ETV Bharat / state

ముస్లింలకు నిత్యావసరాలను పంపిణీ చేసిన ఎంపీ రేవంత్​ రెడ్డి

కరోనా మహమ్మారి నివారణ కోసం ప్రజలందరూ స్వీయ నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఎంపీ రేవంత్​ రెడ్డి సూచించారు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. తప్పనిసరిగా మాస్క్ ధరించటంతోపాటు భౌతిక దూరం పాటించి కరోనాను అరికట్టాలన్నారు.

medchal district latest news
medchal district latest news
author img

By

Published : May 23, 2020, 9:48 AM IST

లాక్​డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేద ముస్లింలకు మల్లాపూర్ 5వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు వంగేటి సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వీఎన్ఆర్ గార్డెన్​లో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ రెడ్డి సుమారు 1000 మంది ముస్లింలకు నిత్యావసర సరకులను అందజేశారు.

కరోనా వ్యాప్తి వల్ల ఉపాధి లేక కనీసం రంజాన్​ పండగ కూడా జరుపుకోలేని స్థితిలో పేద ముస్లింలు ఉన్నారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో నిత్యావసర సరకులు అందించిన సంజీవ రెడ్డిని అభినందించారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించి... ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు ఎంతో కొంత సహాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్​ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి, ప్రవీణ్ రెడ్డితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.