ETV Bharat / state

MP Arvind Fires on Revanth Reddy : రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీని ఎప్పుడు వీడేది తెలియదు: ధర్మపురి అర్వింద్ - బీజేపీ రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశంలో నడ్డా

MP Arvind Fires on Revanth Reddy : రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని ఎప్పుడు వీడేది తెలియదని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. రేవంత్‌ ఓటుకు నోటు కేసు ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణలోని సగం పార్లమెంట్‌లలో హస్తం పార్టీ అడ్రస్ లేదని.. 61 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయని అర్వింద్ విమర్శించారు.

bjp
Arvind
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 6, 2023, 7:17 PM IST

MP Arvind Fires on Revanth Reddy in Medchal District : పసుపు బోర్డు ఏం పని చేస్తుందో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అవగాహన లేదని.. ఎంపీ అర్వింద్ (MP Arvind)విమర్శించారు. మంత్రిగా పని చేసిన అనుభవం రేవంత్‌కు లేదని అన్నారు. పసుపు బోర్డు ఎక్కడ పెట్టాలో తమకు తెలుసని.. దీనిపై రేవంత్‌రెడ్డి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో అర్వింద్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Arvind Fires on Congress : పసుపు పంటను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ (Congress) అని అర్వింద్ ఆరోపించారు. ఆ పార్టీని రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఎప్పుడు వీడేది తెలియదని విమర్శించారు. రేవంత్‌ ఓటుకు నోటు కేసు ఏమైందని ప్రశ్నించారు. సోనియా గాంధీ తెలంగాణకు ఏం ఇచ్చిందని నిలదీశారు. ఆమె సోనియా గాంధీ కాదని.. స్కాంల గాంధీ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలోని సగం పార్లమెంట్‌లలో హస్తం పార్టీ అడ్రస్ లేదని.. 61 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయని అర్వింద్ దుయ్యబట్టారు.

MP Arvind on Sale of Rice by Telangana Government : 'కమీషన్ల కోసమే రాష్ట్ర ప్రభుత్వం.. తక్కువ ధరకు బియ్యం అమ్మకాల యత్నం'

అదానీని పైకి తీసుకు వచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని అర్వింద్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ (KCR) కుటుంబంతో తెలంగాణకు నయా పైసా మేలు జరగలేదని అర్వింద్ ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం నిధుల వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందిందని తెలిపారు. ఇప్పటికే బీఆర్ఎస్ రెండుసార్లు ప్రకటించిన మేనిఫెస్టోలోని ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అర్వింద్ దుయ్యబట్టారు.

BJP State Level Council Meeting in Ghatkesar : రాబోయే ఎన్నికలకు ఎలా సమాయత్తం కావాలని.. ప్రచార వ్యూహాలపై కౌన్సిల్ సమావేశంలో దిశా నిర్దేశం చేశారని.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి (Gujjula Premender Reddy)పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్రం తొమ్మిదేళ్లలో ఏం చేసిందో వివరించామని చెప్పారు. మరికొన్ని తీర్మానాలను ప్రవేశ పెట్టి ఆమోదించుకుంటామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సభల తర్వాత.. బీఆర్ఎస్‌ పార్టీలో అభద్రత భావం మొదలైందని తెలిపారు. భారత్ రాష్ట్ర సమితిని ఢీ కొట్టబోయే పార్టీ.. తమదేనని పునురుద్ఘాటించారు. ఈ నెల 10న తెలంగాణకు అమిత్ షా రాబోతున్నారని గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి వివరించారు.

MP Dharmapuri Arvind on Jeevan reddy : "జీవన్​రెడ్డి సాయం చేశారన్న.. వార్తల్లో వాస్తవం లేదు"

JP Nadda Participated BJP state Level Council Meeting : అంతకు ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) మాట్లాడారు. కేసీఆర్ పాలన రజాకార్లను తలపిస్తోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో.. బీఆర్ఎస్ కుటుంబ పాలన అంతంకావడం ఖాయమని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం.. తొమ్మిదేళ్లలో తొమ్మిది లక్షల కోట్లు కేటాయించిందని లెక్కలు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీల్లో భారతీయ జనతా పార్టీ ఒక్కటే జాతీయ పార్టీ అని, కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ స్థాయికి.. పడిపోయిందని ఆరోపించారు. కౌన్సిల్ సమావేశం నుంచి కమలం నేతలు గ్రామాలకు వెళ్లి.. ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాలని నడ్డా పిలుపునిచ్చారు.

Nizamabad MP Aravind Fires On KCR : కాంగ్రెస్ నాయకులకు ఫండింగ్‌ చేస్తుంది కేసీఆర్‌: ఎంపీ అర్వింద్

BJP Comments on BRS MLA Candidates 2023 : 'దమ్ముంటే ఈటలపై పోటీ చేయ్.. కేసీఆర్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.