ETV Bharat / state

ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్లకు వివరించాలి: సీతక్క

author img

By

Published : Nov 28, 2020, 5:20 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రచార సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నేతల ప్రచారం వేడెక్కుతోంది. జీడీమెట్ల డివిజన్​లో కాంగ్రెస్ అభ్యర్థి బండి లలిత తరుపున ఎమ్మెల్యే సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

mla seethakka said Government failures should be explained to voters
ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్లకు వివరించాలి: సీతక్క

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి ఒక్క రోజు మాత్రమే ఉండడం వల్ల కాంగ్రెస్ తన ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసింది. అందులో భాగంగా జీడీమెట్ల డివిజన్​లో కాంగ్రెస్ అభ్యర్థి బండి లలిత తరుపున ఎమ్మెల్యే సీతక్క ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్లకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

గాజుల రామారం డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్​ గౌడ్​ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. కట్టమైసమ్మ బస్తీలో పాల్గొన్న ఆయన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని పేర్కొన్నారు. ప్రస్తుత నాయకులు సామాన్య ప్రజలను బెదిరించి వసూళ్లు చేయడం తప్ప, ప్రజలకు సేవ చేయడం మర్చిపోయారని అన్నారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

సుభాష్​నగర్ డివిజన్​లో కాంగ్రెస్ అభ్యర్ధి తానం శ్రావణికి మద్దతుగా ఓ చికెన్ దుకాణదారుడు 1000 మంది కాంగ్రెస్​కి ఓటు వేస్తే వారికి 25% డిస్కౌంట్ ఇస్తానని ప్రకటించాడు.

ఇదీ చూడండి : నీచ రాజకీయాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: రేవంత్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.