భారీ వర్షాల కారణంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉమామహేశ్వర కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. సుమారు 6 వందల కుటుంబాలు ఇళ్లను వదిలి.. బయట నివసిస్తున్నారు. మరికొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హాళ్లలో ఉంటున్నారు. ఈ క్రమంలో కొంపల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ రాజు వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున చెక్కులను అందజేశారు.
వరద బాధితులు అధైర్యపడొద్దని.. ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని నేతలు పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.