మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఉపాధిలేని పేదలు, వలస కూలీలకు పది కిలోల బియ్యం, రూ. 500 నగదు పంపిణీ చేశారు. లాక్‌డౌన్ కాలంలో ఎవ్వరూ ఆకలితో బాధపకూడదనే ఉద్దేశ్యంతో పేదలకు సాయం చేస్తున్నట్లు తెలిపారు.
ప్రతీ ఒక్కరు స్వీయ నిర్బంధం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ తహసీల్దార్ నాగరాణి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనాను మించిన తప్పుడు సమాచార సునామీ