మేడ్చల్ జిల్లా బోరంపేట్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలింది. నీరు ఎగిసి పడి, భారీగా నీరు వృథాగా పోతోంది. ఉదయం నుంచి నీరు వృథాగా పోతున్నా... సాయంత్రం వరకు సంబంధిత అధికారులు ఎవరు రాలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాగడానికి నీరు దొరక్క ప్రజలు అవస్థలు పడుతుంటే.. అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. వెంటనే అధికారులు వచ్చి పైప్లైన్ బాగు చేసి నీటి వృథా అరికట్టాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: పల్లెబాటలో జనం... వెలవెలబోతున్న భాగ్యనగరం