ETV Bharat / state

పల్లెబాటలో జనం... వెలవెలబోతున్న భాగ్యనగరం - Empty Roads in Hyderabad

భాగ్యనగరంలోని రహదారులు వెలవెలబోతున్నాయి. నిత్యం వాహనాలతో కిటకిటలాడే కూడళ్లు బోసిపోయాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులు సొంత ఊళ్లకు వెల్లిపోవడం వల్ల... నగరం దాదాపు సగం ఖాళీ అయింది.

Empty Roads in Hyderabad
Empty Roads in Hyderabad
author img

By

Published : Jan 15, 2020, 3:17 PM IST

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్​ నగర వాసులు పల్లెబాట పట్టారు. గత నాలుగైదు రోజుల నుంచి బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సొంత ఊర్లో పండగను ఘనంగా జరుపుకునేందుకు పిల్లాపాపలతో చాలా మంది వెళ్లిపోయారు. రహదారులు చాలా మేరకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

సుమారు కోటి జనాభా ఉన్న భాగ్యనగరంలో 50లక్షల వాహనాలు నిత్యం రహదారులపై తిరుగుతుంటాయి. సాధారణ రోజుల్లో ప్రధాన మార్గాలన్నీ వాహనాలతో రద్దీగా ఉంటాయి. ఉదయం , సాయంత్రం వేళల్లో అయితే వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఉంటుంది.

ఇవాళ ఏ ఒక్క ట్రాఫిక్ పోలీసు రహదారిపై కనిపించడం లేదు. వాహనాల రద్దీ లేకపోవడం వల్ల కూడళ్ల వద్ద వాహనాలు సునాయసంగా ముందుకు వెళ్తున్నాయి.

ఇవీ చూడండి:రాజ్​భవన్... ప్రజాభవన్: సంక్రాంతి వేడుకల్లో గవర్నర్

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.