మేడ్చల్ మున్సిపాలిటీపై తెరాస జెండా ఎగురేయటం ఖాయమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డితో మేడ్చల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. తామంతా ఎప్పుడూ ప్రజల్లో ఉంటామని... కొంత మంది పగటి వేశగాళ్ళు వచ్చి కాసేపు సందడి చేసి వెళ్తారని తలసాని విపక్షాలపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోని నేతలకు వాళ్ల మధ్యే సంబంధాలు సరిగా లేవని ఇక ప్రజలకు ఏం సేవ చేస్తారని ఎద్దేవా చేశారు. తెరాస శ్రేణులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పాలన్నారు. తెరాస ప్రభుత్వం వందల కోట్లలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మిషన్ భగీరథ నీటిని గజ్వేల్ తర్వాత మేడ్చల్ నియోజకవర్గానికే తీసుకువచ్చామన్నారు.
ఇవీ చూడండి: జలహారతి... మానేరులో సీఎం పూజలు