మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ మీర్ పేట్ హోసింగ్ బోర్డులో పలు అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. రూ. 3 కోట్ల 20 లక్షలతో సీసీ రోడ్లకు జీహెచ్ఎంసీ నిధులు కేటాయించింది. కాప్రా సర్కిల్ పరిధిలోని ప్రతి కాలనీలో సీసీ రోడ్లు ఉండాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్ రెడ్డి పాల్గొన్నారు.
- ఇదీ చదవండి : మిర్యాలగూడలో టోకెెన్ల కోసం పడిగాపులు.. రైతుల ఆందోళన