మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్, మూడుచింతలపల్లి మండలాల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్.. రాష్ట్రంలోని ఆడపడుచులందరికి దసరా కానుకగా ఈ చీరలను అందిస్తున్నారని తెలిపారు.
మహిళలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవడానికే.. కరోనా వంటి కష్టకాలంలోనూ.. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి చీరలు అందిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, తెరాస నాయకులు పాల్గొన్నారు.
- ఇదీ చదవండి: ఎయిమ్స్‌ను మరింతగా తీర్చిదిద్దుతాం: కిషన్ రెడ్డి