Corona in Tech Mahindra University: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బహదూర్‌పల్లిలోని టెక్ మహీంద్ర యూనివర్సిటీలో కరోనా కలకలంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పలువురు విద్యార్థులు, సిబ్బందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ కావడంతో వర్సిటీకి సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలో వర్సిటీని డీఎంహెచ్‌వో మల్లికార్జున్ పరిశీలించారు.
వర్సిటీలోని 25 మంది విద్యార్థులకు, ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయిందని.. డీఎంహెచ్‌వో(medchal dmho visited tech Mahindra university) చెప్పారు. ప్రస్తుతం కరోనా బాధితులంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. వర్సిటీ సిబ్బంది, దుకాణదారులకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
వర్సిటీలో 25 మంది విద్యార్థులు, ఐదుగురు సిబ్బందికి కరోనా సోకింది. వారంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. పాజిటివ్ వచ్చిన 30 మంది..2 డోసులు తీసుకున్నారు. -మల్లికార్జున్, మేడ్చల్ మల్కాజిగిరి డీఎంహెచ్‌వో
టెక్ మహీంద్ర వర్సిటీలో కరోనా కలకలం.. వసతిగృహం ఖాళీ చేసిన విద్యార్థులు
యూనివర్సిటీలో కరోనా కలకలంతో విద్యార్థులకు 15 రోజులు సెలవు ప్రకటించినట్లు మల్లికార్జున్ వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారంతా కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారేనని చెప్పారు.
వర్సిటీలో నిన్న కరోనా కేసులు నమోదు కావడంతో.. యూనివర్సిటీ ప్రతినిధులు విద్యార్థులకు నిన్న, నేడు సెలవు ప్రకటించారు. వర్సిటీ ప్రాంగణంలో శానిటైజేషన్ చేసి తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు. కొవిడ్ భయంతో విద్యార్థులంతా వసతి గృహం ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లారు.
ఇదీ చదవండి: Harish rao review on corona New variant: కొత్త వేరియంట్లు, మూడో దశ వస్తే.. ఏం చేద్దాం?: హరీశ్‌రావు