మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ.. మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం అధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. శ్రీశైలం విద్యుత్ ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తే అన్యాయంగా అరెస్టు చేసి పోలీసుల అదుపులో ఉంచడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలను ప్రతిచోట అడ్డుకోవడాన్ని నిరసిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. విద్యుత్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.
ఇవీచూడండి: ఆ గంటలో ఏం జరిగింది ? ప్రమాదం ఎందుకు సంభవించింది ?