Massive Thefts at Two Separate Locations: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే ఓ ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ద్వారక నగర్ కాలనీకి చెందిన తాల్క రాములు ఇంట్లో 15 తులాల బంగారం, రూ. 9 లక్షల నగదును దోచుకెళ్లారు. శుక్రవారం రాములు కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి సమీపంలోని చర్చికి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కుమార్తె ఇంటికి వచ్చింది.
వచ్చి చూసేసరికి తలుపు తాళం పగలు గొట్టి ఉండటంతో తండ్రి రాములుకు సమాచారం అందించింది. లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో బీరువాలోని సామగ్రి చిందరవందరంగా పడేసి ఉండటంతో పాటు బంగారు నగలు, డబ్బు కనిపించ లేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. సీఐ అశోక్ రెడ్డి, సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.
Thieves Commit Theft in a House in Warangal: మరోవైపు జనగామ పట్టణంలో గురువారం అర్ధరాత్రి తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇండస్ట్రియల్ ఏరియాకు చెందిన మెరుగు భగవానంద రెడ్డి నిన్న ఉదయం తన కుటుంబంతో కలిసి ఫంక్షన్ నిమిత్తం.. హైదరాబాద్కు వెళ్లారు. దీనిని గమనించిన దొంగలు అర్ధరాత్రి తాళం పగులగొట్టి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. 10 తులాల బంగారు నగలు, 2 ఐపాడ్లు, రూ.80 వేల నగదును ఎత్తుకెళ్లారని బాధితుడు వాపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకున్నారు. ఏసీపీ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘటన స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీమ్, డాగ్ స్వ్కాడ్ ద్వారా కేసును దర్యాప్తు చేస్తున్నారు.
"మా స్వగ్రామం గోవర్ధనగిరి. నిన్న మా పాపది ఓ కంపెనీలో మీటింగ్ ఉంటే నేను, నా భార్య, పాప ముగ్గురం హైదరాబాద్కు వెళ్లాం. మేము నైట్ అక్కడే ఉన్నాం. నిన్న మార్నింగ్ 10:30కి వెళ్లాం. ఈరోజు ఉదయం 8:30కి వచ్చాం. మేము వచ్చేసరికి డోర్లు పగులగొట్టి ఉంది. నైట్ దొంగలు పడ్డారు. అందులో భాగంగా 10 తులాల బంగారం, రూ.80 వేలు నగదు, 2 ఐపాడ్లు దోచుకెళ్లారు. ఇళ్లు లోపల కూడా డోర్లు, కబోర్డ్లు బాగా డ్యామెజీ చేశారు. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాను." -మెరుగు భగవానంద రెడ్డి, బాధితుడు
ఇవీ చదవండి: