ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య - latest news on Married suicide in a suspicious state

ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త, అత్తమామలే తమ కూతురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో చోటుచేసుకుంది.

Married suicide in a suspicious state
అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య
author img

By

Published : Feb 2, 2020, 9:29 PM IST

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా నాగారంలో భవాని అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. భర్త గంగాధర్‌, అత్తమామలే భవానిని చంపి ఆత్మహత్యగా చెబుతున్నారంటూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.

అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య

నాగారంలో నివాసం ఉంటున్న గంగాధర్‌కు భవానితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వాళ్ల అన్యోన్య కాపురానికి గుర్తుగా ఇద్దరు పిల్లలూ పుట్టారు. అప్పటి వరకు బాగానే చూసుకున్న గంగాధర్‌.. అదనపు కట్నం తేవాలంటూ భవానిని హింసించడం మొదలుపెట్టాడు. తమ కొడుకు చేస్తున్న పని తప్పని చెప్పాల్సిన తల్లిదండ్లులు సైతం గంగాధర్‌కు వత్తాసు పలికారు. ఇచ్చిన కట్నం చాలదు.. అదనంగా కట్నం తీసుకురమ్మంటూ ముగ్గురూ భవానిని చిత్రహింసలకు గురిచేశారు. ఇవన్నీ తట్టుకోలేని భవాని తన పుట్టింటికి వెళ్లిపోయింది.

మళ్లీ అవే కష్టాలు..

తమ కూతురి కాపురాన్ని నిలబెట్టాలనుకున్న ఆ తల్లిదండ్రులు.. భవానికి ధైర్యం చెప్పి మళ్లీ కాపురానికి పంపించారు. మెట్టింటికి వచ్చిన భవానికీ మళ్లీ అవే కష్టాలు మొదలయ్యాయి. ఈ మధ్యే భవానిని చూడటానికి తమ తల్లిదండ్రులు వచ్చినా.. గేటు బయటే నిలబెట్టి మాట్లాడించి పంపించేశారు. వారితో ఫోన్లో మాట్లాడినా ఫోను లాగేసుకుంటూ తనను పూర్తిగా గృహ నిర్బంధం చేశారు. ఇవన్నీ తట్టుకోలేని భవాని.. శుక్రవారం ఇంట్లోని ఫ్యానుకి ఉరి వేసుకుని చనిపోయింది.

కుటుంబ సభ్యుల ఆందోళన..

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తమ కూతురి మరణంపై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు తెలపడం వల్ల మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. ఆసుపత్రి వద్దకు వచ్చిన భవాని కుటుంబ సభ్యులు భర్త, అత్తమామలే తమ కూతురిని చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. తమ కూతురి చావుకి కారణమయిన వారికి తగిన శిక్ష విధించి తమకు న్యాయం చేయాలంటూ విలపించారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: భార్యను చంపి జాతీయ గీతం పాడిన భర్త!

Intro:సికింద్రాబాద్ యాంకర్..భర్త అత్తమామలు వరకట్నం కోసం మానసిక వేధించి తమ కోడలిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని మృతురాలు భవాని మామ శ్రీనివాస్ ఆరోపించారు..నాగారం లో నివాసం ఉంటున్న భవాని గంగాధర్ దంపతులకు గత 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది ..భవాని గంగాధర్ దంపతులకు గత కొన్ని నెలల క్రితం వివాహం జరిగినట్లు ఇద్దరు సంతానం కూడా ఉన్నట్లు తెలిపారు..భవాని వద్ద ఫోన్ లేకుండా చేసి ఆమెను గృహ హింసకు గురి చేశారని వారు ఆరోపించారు..గతంలో కూడా వరకట్నం కోసం వేధించి చేశారని అయినప్పటికీ తాము సర్ది చెప్పినప్పటికీ వినలేదని అన్నారు..భవానీ తీవ్రమైన మానసిక వేదనకు గురి చేసి కొట్టి ఉరి వేశారని వారు ఆరోపించారు..వెంటనే భర్త గంగాధర్ పై కేసు నమోదు చేసి ఆమె అత్తమామలను కూడా అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు..మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు..గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్ద మృతురాలి కుటుంబ సభ్యులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు
బైట్..శ్రీనివాస్..మృతురాలి మేనమామ Body:VamshiConclusion:7032401099

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.