ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో జాతీయ పార్టీలు లేవని మల్కాజిగిరి తెరాస లోక్సభ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర వహిస్తాయని స్పష్టం చేశారు. రాజకీయ చరిత్ర పెద్దగా లేకపోయినా... మామ మల్లారెడ్డి చేసిన సేవలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేల సహకారంతో సులువుగా విజయం సాధిస్తానంటున్నారు మర్రి రాజశేఖర్రెడ్డి.
ఇవీ చూడండి:'చౌకీదార్లు, టేకేదార్లు కాదు.. జిమ్మేదారు కావాలి'