ETV Bharat / state

భూ తగాదా: కత్తులతో దాడి చేసిన మాణిక్య రెడ్డి - భూ తగాదాలు

కొన్నేళ్లుగా అన్నదమ్ముల మధ్య సాగుతోన్న భూ తగాదాలు చివరకు వారు కత్తులతో దాడి చేసుకునే స్థితికి దారి తీశాయి. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

land issues at jawahar nagar medchal district
భూ తగాదా: కత్తులతో దాడి చేసిన మాణిక్య రెడ్డి
author img

By

Published : Mar 4, 2020, 7:25 PM IST

Updated : Mar 4, 2020, 9:38 PM IST

భూ విషయంలో జరిగిన గొడవలో నరేందర్ రెడ్డిపై మాణిక్య రెడ్డి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో నరేందర్ రెడ్డి అతని భార్యకు తీవ్ర గాయాలు కావడం వల్ల స్థానికంగా ఉండే విజయ ఆస్పత్రికి తరలించారు. నగరంలోని జవహర్ నగర్ హరి దాసపల్లి చెందిన సంజీవ రెడ్డికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కొడుకు మాణిక్య రెడ్డి, రెండో భార్య కొడుకు నరేందర్ రెడ్డి. హరి దాసపల్లి ప్రాంతంలో ఉన్న ఐదెకరాల వివాదాస్పద స్థలం గురించి అన్నదమ్ముళ్లు తరచూ గొడవ పడుతున్నారు.

ఇటీవల మాణిక్యరెడ్డి వేసిన పంటను నరేందర్​ రెడ్డి దౌర్జన్యంగా తొలగించాడు. ఆగ్రహించిన మాణిక్య రెడ్డి ఇష్టారీతిగా తిడుతూ... కొడవలి, కత్తితో పొలంలో ఉన్న నరేందర్​ రెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. మాణిక్య రెడ్డిపై కేసు నమోదు చేసిన జవహర్​ నగర్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భూ తగాదా: కత్తులతో దాడి చేసిన మాణిక్య రెడ్డి

ఇదీ చదవండి: వైరస్ భయం.. ఇంటి ముందు శుభ్రం..

Last Updated : Mar 4, 2020, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.