మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌లో సుమారు 3వేల మంది వలస కార్మికులకు తెరాస నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో బత్తాయి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పాల్గొని కూలీలకు పండ్లు అందించారు. విటమిన్ సి అధికంగా ఉండే బత్తాయి పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆయన సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.
వలస కార్మికులకు బత్తాయి పండ్ల పంపిణీ - తెరాస నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డి
ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌లో 3వేల మంది వలస కార్మికులకు తెరాస నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డి బత్తాయి పండ్లను పంపిణీ చేశారు. ఈ పండ్లను తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు.