డబ్బు విషయంలో భర్తతో గొడపడి... ఇల్లాలు ఇద్దరు పిల్లలను తీసుకోని వెళ్లిపోయింది.మేడ్చల్ జిల్లా ముత్వేలిగూడకు చెందిన స్థిరాస్తి వ్యాపారి ధనంజయ భార్య స్వాతి, ఇద్దరు పిల్లలతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నారు. డబ్బుల విషయంలో కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవ జరుగుతోంది. దీంతో మనస్తాపం చెందిన స్వాతి ఇద్దరు పిల్లలతో బయటికు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ దొరకలేదు.
స్వాతి తండ్రి ఫిర్యాదుతో పోలీసుల అదృశ్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఆ వరస హత్యలు చేసింది సైకో కిల్లరా?