ETV Bharat / state

తెరాస ప్రభుత్వంతోనే కార్పొరేషన్ల రూపరేఖలు మారాయి: మల్లారెడ్డి - మంత్రి మల్లారెడ్డి వార్తలు

తెరాస ప్రభుత్వంతోనే కార్పొరేషన్ల రూపురేఖలు మారాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పిర్జాదిగూడ నగర పాలక సంఘం పరిధిలో రూ.1.40 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

తెరాస ప్రభుత్వంతోనే కార్పొరేషన్ల రూపరేఖలు మారాయి: మల్లారెడ్డి

author img

By

Published : Jun 6, 2021, 7:22 PM IST

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పిర్జాదిగూడ నగర పాలక సంఘం పరిధిలో సుమారు రూ.1.40కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మేయర్‌ జక్కావెంకట్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. తెరాస ప్రభుత్వంతోనే కార్పొరేషన్ల రూపురేఖలు మారాయన్నారు. అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.

కరోనా వ్యాప్తితో ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా తెరాస ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పాటు పడుతోందని అన్నారు. కొవిడ్​ కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

ఇదీ చదవండి: దిల్లీ ఆసుపత్రిలో 'మలయాళ' దుమారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.