ETV Bharat / state

KTR Interesting Comments on PM Narendra Modi : 'మోదీపై పరోక్ష వ్యాఖ్యలు.. చాయ్‌ అమ్ముకునే వారు దేశాన్ని మోసం చేయొద్దు' - KTR Bhumipuja for Eurofins in Genome Valley

KTR Interesting Comments on PM Narendra Modi : రెండో విడత డబుల్ బెడ్​రూమ్ ఇళ్ల పంపిణీ హైదరాబాద్​లో ఉత్సాహంగా సాగింది. మంత్రి కేటీఆర్ మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై పరోక్షంగా విమర్శలు చేశారు. చాయ్ అమ్ముకునే వారు దేశాన్ని మోసం చేయవద్దని సూచించారు.

distribution of double bedroom houses in Hyderabad
KTR Latest News
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 21, 2023, 4:30 PM IST

KTR Interesting Comments on PM Narendra Modi in Dundigal : ఇల్లు కట్టిచూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలనే వారని.. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ మాత్రం ఇండ్లు నేనే కట్టిస్తా.. వివాహం నేనే చేయిస్తానని అంటున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో రూ.50,000 కోట్లు ఖరీదు చేసే ఆస్తులను ప్రభుత్వం పేదలకు ఇస్తుందని తెలిపారు. మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను కేటీఆర్ (KTR) పంపిణీ చేశారు. ఈ రోజు 9 ప్రాంతాల్లో మంత్రులు మేయర్ ఆధ్వర్యంలో రెండో విడతగా 13,300 ఇండ్లను పంపిణీ చేస్తున్నారని ఆయన వివరించారు.

KTR Distributed Double Bedroom Houses Dundigal : ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గానికి 500, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గానికి 300, సనత్‌నగర్ నియోజకవర్గానికి 500, కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన 500 మంది లబ్ధిదారులకు కేటీఆర్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పంపిణీ (Double Bedroom Houses) ఎంతో పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. జగద్గిరిగుట్ట డివిజన్‌ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలికి ఇల్లు వచ్చిందని వెల్లడించారు.

ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చు అవుతుందని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల లోపు గ్రేటర్ పరిధిలో లక్ష ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఇళ్లు నిర్మించాయా అని ప్రశ్నించారు. దుండిగల్‌కు త్వరలోనే కొత్త పరిశ్రమ రాబోతోందని అన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించాలని కోరారు. దిల్లీ నుంచి హామీలు ఇస్తే తొందర పడొద్దని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

KTR Comments on PM Modi : ఈ క్రమంలోనే కేటీఆర్‌కు, ఇంటి పట్టా అందుకునేందుకు వచ్చిన మహిళకు మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. పట్టా తీసుకునేందుకు వచ్చిన ఆమెతో.. మంత్రి మాట్లాడారు. మహిళ పేరు, చేసే పని గురించి కేటీఆర్ అడిగారు. తాను టీ అమ్ముకుంటానని సమాధానం చెప్పింది. చాయ్‌ అమ్ముకునే వాళ్లు దేశాన్ని మోసం చేయవద్దన్నారు. మంత్రి వ్యాఖ్యలతో సదరు మహిళ కంగారుపడగా.. చాయ్‌ అమ్మి దేశాన్ని మోసం చేసిన వారి గురించి మాట్లాడానని.. తన గురించి కాదని చెప్పారు. ఈ సంభాషణతో ప్రధాని మోదీనుద్దేశించి (Narendra Modi) పరోక్షంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కార్యక్రమంలో నవ్వులు పూయించాయి.

"రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఒక్క రోజే 13,300 ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తున్నాం. ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చు అవుతుంది. కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తలకు సైతం రెండు పడకల గదుల ఇళ్లు అందిస్తున్నాం. కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఇళ్లు నిర్మించాయా?. భవిష్యత్‌లో అర్హులందరికీ రెండు పడకల గదుల ఇళ్లు ఇస్తాం. రూ.73,000 కోట్లతో రైతులకు రుణమాఫీ చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు అమలు చేస్తున్నాం." - కేటీఆర్‌, మంత్రి

KTR Interesting Comments on PM Narendra Modi చాయ్‌ అమ్ముకునే వారు దేశాన్ని మోసం చేయొద్దు

Minister KTR on Congress Six Guarantee : 'ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే ఉద్దేశంతోనే.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు'

Minister KTR Interesting Comments : 'అటు ఇటు కాకుండా రాజకీయ నాయకుడినయ్యా..' పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న మంత్రి కేటీఆర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.