ETV Bharat / state

'ప్రభుత్వ పాఠశాలలో చేరండి.. రూ.5వేలు పొందండి' - domakunta government school

government school: ప్రభుత్వ బడులలో అభివృద్ధి కోసం ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. అయినా పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య నామమాత్రంగానే ఉంటుంది. ఇది గమనించిన ఓ గ్రామంలోని ప్రజాప్రతినిధులు తమ ఊరిలోని ప్రాథమిక పాఠశాలలో చేరిన విద్యార్థులకు అద్భుతమైన ఆఫర్ ప్రకటించారు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ప్రభుత్వ పాఠశాల
ప్రభుత్వ పాఠశాల
author img

By

Published : Jun 20, 2022, 11:37 AM IST

government school: ప్రభుత్వాలు వేల కోట్లరూపాయలు విద్య కోసం ఖర్చు చేస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య నామమాత్రంగానే ఉంటుంది. విద్యార్థుల చేరికను పెంచేందుకు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం గోధుమకుంటలో ప్రజాప్రతినిధులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి రూ.5 వేలు ఇస్తామంటూ సర్పంచ్ ఆకిటి మహేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ ఆంజనేయులు నిర్ణయించారు. దాతల సాయంతో అన్ని వసతులతో పాటు పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణం కల్పించారు. అంతేకాక విద్యార్థికి ఉచితంగా రెండు జతల యూనిఫామ్‌లు, బూట్లు, సాక్సులు, బస్‌పాస్‌ అందిస్తామని పేర్కొన్నారు. ప్రకటించిన నజరానాల వివరాలతో పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.