మేడ్చల్ పేట్ బషీరాబాద్ గణేశ్ హౌసింగ్ కాలనీలో ఉంటున్న వినోద అనే మహిళ ఇంట్లో చోరీ జరిగింది. మధ్యాహ్నం ఇద్దరు దుండగులు ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. గాయపరిచి బంధించిన అనంతరం తన మెడలో పుస్తెలతాడు, బీరువాలో ఉన్న నగలు ఎత్తుకెళ్లారు. సుమారు ఆరున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎవరో తెలిసిన వ్యక్తులే ఇంట్లో ఎవరూ లేరని గమనించి చోరీ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.