ETV Bharat / state

Villas demolition: చెరువు బఫర్​ జోన్​లో విల్లాల నిర్మాణం.. కూల్చేసిన అధికారులు - తెలంగాణ వార్తలు

మేడ్చల్ జిల్లా దుండిగల్​ మండలం మల్లంపేట చెరువు బఫర్​ జోన్​లో నిర్మిస్తున్న విల్లాలను అధికారులు కూల్చేశారు. బఫర్​ జోన్​లో నిర్మాణాలు చేపట్టడం అక్రమమని చెప్పారు. బఫర్​ జోన్​లో ఎలాంటి నిర్మాణం చేపట్టొద్దన్నారు.

demolished
కూల్చివేత
author img

By

Published : Sep 9, 2021, 5:45 PM IST

చెరువు బఫర్ జోన్​లో ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థ అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో వాటిని అధికారులు కూల్చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్​ మండల పరిధిలోని మల్లంపేటలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస అనే ప్రైవేటు నిర్మాణ సంస్థ విల్లాల నిర్మాణం చేపట్టింది. అయితే పక్కనే ఉన్న కత్వ చెరువు బఫర్ జోన్​లో కూడా విల్లాల నిర్మాణం చేపట్టగా.. స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

స్పందించిన ఇరిగేషన్ అధికారులు పరిశీలన చేశారు. బఫర్ జోన్​లో ఏడు విల్లాలు అక్రమంగా నిర్మిస్తున్నట్లు గుర్తించారు. వాటిని పోలీసుల బందోబస్తు మధ్య రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు కలిసి జేసీబీ సాయంతో వాటిని కూల్చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు రెండు విల్లాలను నేలమట్టం చేయగా మిగతా ఐదు కూల్చాల్సి ఉంది. బఫర్​ జోన్​లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని అధికారులు హెచ్చరించారు.

ఇదీ చదవండి: Ind Vs Eng: టీమ్​ఇండియాలో మరొకరికి కరోనా.. ఐదో టెస్టు డౌటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.