ETV Bharat / state

Hakimpet Sports School Sexual Harassments Update : 'హకీంపేట్' లైంగిక ఆరోపణల ఘటనపై ప్రత్యేక బృందం దర్యాప్తు.. త్వరలోనే సమగ్ర నివేదిక

author img

By

Published : Aug 14, 2023, 8:02 AM IST

Hakimpet Sports School Sexual Harassments Update : హకీంపేట క్రీడా పాఠశాల మాజీ ఓఎస్డీ హరికృష్ణపై వచ్చిన లైంగిక ఆరోపణల మీద ప్రత్యేక బృందం దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ.. పాఠశాలలో ప్రతి ఒక్కరినీ విచారించింది. స్టేట్‌మెంట్స్‌ నమోదు చేసుకుంది. సమగ్ర నివేదికను త్వరలో క్రీడా శాఖకు అందిస్తామని దర్యాప్తు అధికారులు తెలిపారు.

Hakimpet Sports School Sexual Harassments Update
Hakimpet Sports School Incident
Hakimpet Sports School Sexual Harassments Update : 'హకీంపేట్' లైంగిక ఆరోపణల ఘటనపై ప్రత్యేక బృందం దర్యాప్తు.. త్వరలోనే సమగ్ర నివేదిక

Hakimpet Sports School Sexual Harassments Update : మేడ్చల్‌ జిల్లా హకీంపేట్‌లోని రాష్ట్ర క్రీడా పాఠశాలలో లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టించాయి. పాఠశాల ఓఎస్డీగా ఉన్న హరికృష్ణ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే కథనాలు కలకలం సృష్టించాయి. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. చర్యలు తీసుకోవాలని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను కోరారు.

ఘటనపై విచారణకు ఆదేశించిన ఆయన.. ఓఎస్డీ హరికృష్ణను సస్పెండ్ చేశారు. కొత్త ఓఎస్డీగా సుధాకర్‌ను నియమించారు. కీసర ఆర్డీవో ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. బాలల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు రాగ జ్యోతి సహా పలు శాఖల అధికారులు దర్యాప్తులో పాల్గొన్నారు. హకీంపేట క్రీడా పాఠశాల కోచ్‌లు, వార్డెన్లు, బాలికలను పలుమార్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

హాస్టల్​కు వచ్చి HM లైంగిక వేధింపులు.. కర్రలు, చీపుర్లతో చితకబాదిన అమ్మాయిలు

ఓఎస్డీ హరికృష్ణపై వచ్చిన ఆరోపణలపై ఆరా తీశారు. బాలికలతో విడివిడిగా స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. అధికారులకు నేరుగా చెప్పలేని విషయాలు ఉంటే పేపర్ మీద రాసి ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా ఆరోపణలు చేసిన బాలికను రహస్య ప్రదేశంలో విచారించినట్లు సమాచారం. ఉన్నతాధికారులు ఆదేశం మేరకు మాజీ ఓఎస్డీని విచారించామని.. బాలల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు జ్యోతి తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణకు సమయం పడుతుందన్నారు. అందుబాటులో ఉన్న అందరు ఉద్యోగుల నుంచి సమాచారం రాబట్టామన్నారు.

"ప్రాథమిక విచారణ అయిపోయింది. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు విద్యార్థులను, టీచర్లను, మాజీ ఓఎస్డీని విచారించాం. ఇప్పుడే నివేదికను బయటపెట్టలేం. సున్నితమైన అంశం కాబట్టి.. పూర్తి విచారణకు సమయం పడుతుంది". - రాగ జ్యోతి, బాలల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు

Telangana Govt Investigate on Hakimpet Incident : తనపై ఆరోపణలపై విచారణ జరపకుండా వెంటనే సస్పెండ్ చేయడంపై.. మాజీ ఓఎస్డీ హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తమ కుటుంబ పరువు పోయిందని ఆయన భార్య వాపోయారు. విచారణ అనంతరం.. తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని తేలితే జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారని హరికృష్ణ ప్రశ్నించారు.

విచారణ అనంతరం మాజీ ఓఎస్డీ హరికృష్ట వెళ్లిపోతుండగా.. కొందరు విద్యార్ధులు ఆయన కారును అడ్డుకున్నారు. తమను వదలి వెళ్లిపోవద్దని కన్నీరు పెట్టుకున్నారు. హరికృష్ణ తమకు తండ్రి లాంటివారని ఆయనపై ఆరోపణలు రావడం చాలా బాధ కలిగించిందన్నారు. సమగ్ర విచారణ తర్వాత.. క్రీడ శాఖకు అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. నిజ నిర్ధరణ తర్వాత.. ఆరోపణలు రుజువైతే మాజీ ఓఎస్డీ హరికృష్ణ, అతడికి సహకరించిన వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

"నాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపకుండా సస్పెండ్​ చేయడం బాధాకరం. ఈ ఘటనతో మా కుటుంబం పరువుపోయింది. విచారణ అనంతరం నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమైతే.. మాకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు". - హరికృష్ణ, మాజీ ఓఎస్డీ

Sexual Harassment in Hakimpet Sports School : హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో లైంగిక వేధింపుల కలకలం.. ఓఎస్డీ సస్పెండ్

'చిన్నారులపై లైంగిక దాడులు.. మౌనంవీడి ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే తగ్గుముఖం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.