యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా విమాన గోపురం.. బంగారు తాపడానికి దాతల(Gold Donations for Yadadri) విరాళాలు కొనసాగుతున్నాయి. మేడ్చల్ నియోజకవర్గంలోని స్థిరాస్తి వ్యాపారులు రూ. 3 కోట్ల 26 లక్షలు విరాళం అందజేశారు. అందుకు సంబంధించిన నగదు, చెక్కులను మంత్రి మల్లారెడ్డికి ఇచ్చారు. ఈ మేరకు ఘట్కేసర్లోని మంత్రి మల్లారెడ్డి క్యాంప్ కార్యాలయంలో పూజలు నిర్వహించారు.
అనంతరం కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆలయానికి ప్రదర్శనగా బయలుదేరారు. ఆలయ అధికారులకు ఆ చెక్కులు, నగదును అందజేశారు. మంత్రి మల్లారెడ్డి ఇప్పటికే కుటుంబసభ్యులు, నియోజకవర్గ తెరాస నేతల తరఫున విమాన గోపురం(Gold Donations for Yadadri) బంగారు తాపడానికి రూ. 3 కోట్ల 82లక్షల విరాళం అందించారు. విరాళాలు ఇచ్చేందుకు మరింత మంది దాతలు ముందుకు వస్తున్నారని.. మూడు నాలుగు విడతలుగా అందజేస్తామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
యాదాద్రీశుని విమాన గోపురానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. పది రోజుల క్రితం రూ. 3 కిలోల బంగారానికి సరిపడా నగదు అందజేశారు. ఇప్పుడు మరో రూ. 3 కోట్ల 26 లక్షలు చాలా మంది వ్యాపారులు ఇచ్చారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా ఇస్తున్నారు. ఇంకా విరాళాలు సమకూరుతున్నాయి. విడతల వారీగా అందజేస్తాం. -మల్లారెడ్డి, కార్మిక శాఖ మంత్రి
సీఎం పిలుపు మేరకు
తెలంగాణలో ప్రతిష్ఠాత్మకమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహుడి(Yadadri Lakshmi Narasimha Swamy Temple).. ఆలయ పునర్నిర్మాణం చరిత్రాత్మకంగా సాగుతోంది. ఈ క్రమంలో స్వర్ణ విమాన గోపురానికి విరాళాల కోసం సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆలయ విమాన గోపురానికి బంగారుతాపడం కోసం ఇప్పటికే విరాళాలు (Gold Donation For Yadadri) వెల్లువెత్తాయి. యాదాద్రి ఆలయ విమాన గోపురానికి తమ కుటుంబం తరఫున కిలో 16 తులాల బంగారం విరాళమిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ (Kcr Gold Donation For Yadadri) ప్రకటించారు. ఆలయ విమాన గోపురానికి భారీగా బంగారం అవసరమని సీఎం తెలిపారు. విమాన గోపురానికి 125 కిలోల బంగారం అవసరం పడుతుందని ముఖ్యమంత్రి వివరించారు. విమాన గోపురానికి దాతలు బంగారం విరాళం ఇస్తామని చెప్పినట్లు సీఎం పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డి(Telangana Minister MallaReddy) తన వంతుగా 3 కిలోల బంగారానికి సరిపడా నగదును చెక్కురూపంలో అక్టోబరు 28న ఆలయ అధికారులకు అందజేశారు. మళ్లీ నేడు స్థిరాస్తి వ్యాపారుల తరఫున మరో రూ. 3 కోట్ల 26 లక్షలు నగదు, చెక్కుల రూపంలో అందజేశారు.
ఇదీ చదవండి: Karthika masam 2021: రాష్ట్రంలో కార్తిక శోభ.. శైవ క్షేత్రాలలో భక్తుల ప్రత్యేక పూజలు