ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన వాటర్​ ట్యాంకర్​.. యువతి మృతి - crime news

మేడ్చల్​ జిల్లా హైదర్​నగర్​లో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని వాటర్​ట్యాంకర్​ వెనుక నుంచి ఢీకొట్టడంతో యువతి ప్రాణాలు కోల్పోయింది.

girl died in road accident in medchal district
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన వాటర్​ ట్యాంకర్​.. యువతి మృతి
author img

By

Published : Jul 4, 2020, 3:36 PM IST

ద్విచక్రవాహనాన్ని వాటర్​ ట్యాంకర్​ ఢీకొట్టడం వల్ల యువతి మృతి చెందింది. ఈ ఘటన మేడ్చల్​ జిల్లా హైదర్​నగర్​లో చోటుచేసుకుంది. కేపీహెచ్​బీ పీఎస్​ పరిధిలోని హైదర్​నగర్ ప్రధాన రహదారిపై ఉదయం డ్రైవ్ ఈజీ ద్వారా స్కూటీని బుక్ చేసుకొని మియాపూర్ నుంచి కూకట్​పల్లి వైపుగా వస్తుంది. అదే సమయంలో వెనుక నుంచి వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడం వల్ల యువతి కిందపడింది. ఆమె తలకు బలమైన గాయం కావడం వల్ల అక్కడికక్కడే మృతి చెందింది.

వాటర్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.

ఇవీ చూడండి: డివైడర్​ను ఢీకొట్టిన బైక్​.. ఒకరి మృతి.. మరొకరికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.