ETV Bharat / state

హిమాలయాల్లోనే కాదు ఈ ఇంట్లోనూ పూసిన బ్రహ్మకమలాలు - బ్రహ్మ కమలం

అరుదుగా కనిపించే బ్రహ్మ కమలం పుష్పాలు కుత్బుల్లాపూర్​లోని ఓ సామాన్యుడి ఇంట్లో వికసించడం అందరనీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హిమాలయాల్లో మాత్రమే కనిపించే ఈ పుష్పాలు తమ ఇంట్లో పూయడం ఆనందంగా ఉందని ఆ ఇంటి యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ దృష్యాన్ని చూడడానికి స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.

హిమాలయాల్లోనే కాదు మా ఇంట్లోనూ బ్రహ్మకమలాలు కనిపిస్తాయి!!
author img

By

Published : Aug 22, 2019, 1:47 PM IST

మేడ్చల్​ జిల్లా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని బీరప్పనగర్​ ఆకృతి హోమ్స్ అపార్ట్మెంట్​లో భాస్కరాచారి, శోభ దంపతుల ఇంట్లో అరదైన బ్రహ్మకమలం పుష్పాలు పూయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. 3 సంవత్సరాల క్రితం ఈ బ్రహ్మ కమలం మొక్కను తెచ్చి తమ ఇంట్లో పెంచుతున్నామని, నిన్న రాత్రి సమయంలో రెండు మొగ్గలు విచ్చుకొని బ్రహ్మ కమలం పుష్పంగా మారాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆ దంపతులు. సంవత్సరంలో ఒక సారి మాత్రమే విచ్చుకునే ఈ అరుదైన పుష్పానికి పూజలు చేశారు. గత సంవత్సరం ఇదే మొక్కకు 1పుష్పం వచ్చిందని, ఇప్పుడు 2 బ్రహ్మ కమలాలు పూశాయని చెప్పారు. ఈ వింతను చూడటానికి స్థానికులు ఆసక్తి కనపరుస్తున్నారు.

హిమాలయాల్లోనే కాదు మా ఇంట్లోనూ బ్రహ్మకమలాలు కనిపిస్తాయి!!

ఇదీ చూడండి: 'పాక్​కు భారత జలాల నిలిపివేత ప్రక్రియ ప్రారంభం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.